జోగిపేటలో రాజీవ్ గాంధీ జయంతి

SRD: జోగిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి కార్యక్రమం బుధ వారం నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ఆశ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశం, రాజశేఖర్ పాల్గొన్నారు.