'SSMB 29' కోసం RFCలో భారీ LED టవర్
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'SSMB 29'. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఈనెల 15న విడుదల కానున్నాయి. HYDలోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ మేరకు RFCలో 100 అడుగుల ఎత్తయిన LED టవర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, జియో హాట్‌స్టార్‌లో ఈ వేడుకను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు.