అమ్మాయి ప్రేమ కోసం సెల్ టవర్ ఎక్కిన యువకుడు
ASF: బెజ్జూరు మండలం మద్దిగూడ గ్రామానికి చెందిన కోరితే కిష్టయ్య అనే యువకుడు, సులుగుపల్లి గ్రామానికి చెందిన అమ్మాయిని 4 నెలలుగా ప్రేమిస్తున్నాడు. అమ్మాయి తల్లిదండ్రులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ శుక్రవారం సులుగుపల్లి గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి గంటసేపు హైడ్రామా సృష్టించాడు. బెజ్జూర్ ఎస్సై సర్తాజ్ పాష,యువకుడిని టవర్ నుంచి దించి అదుపులోకి తీసుకున్నారు.