'నిర్వాసితుల త్యాగం చిరస్మరణీయం'

'నిర్వాసితుల త్యాగం చిరస్మరణీయం'

KKD: పోలవరం ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన కుమ్మరిలోవ వాసుల రుణం తీర్చుకోలేనిదని ఎమ్మెల్యే యనమల దివ్య కొనియాడారు. గురువారం కుమ్మరిలోవ ఆర్అండ్ఆర్ నిర్వాసిత కాలనీకి ఆమె శంకుస్థాపన చేశారు. నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాలనీలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.14 కోట్లు కేటాయించామని తెలిపారు.