వాహనాలకు అడ్డంకిగా మారిన కేబుల్ వైర్లు
VZM: కొత్తవలస కూడలిలో కేబుల్ వైర్లు, ఫైబర్ నెట్ వైర్లు తక్కువ ఎత్తులో కట్టడం వలన పరిశ్రమలకు రాకపోకలు సాగించే భారీ వాహనాలకు తగులుతున్నాయి. దీనివలన అటువైపుగా వెళ్ళే వాహనాలకు అడ్డంకింగా తయారైంది. దీంతో మూడురోడ్ల కూడలిలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. తక్షణమే సంబంధిత నిర్వాహకులు వాటిని తొలగించి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.