'ఒక్క రోజూ స్కూల్ డుమ్మా కొట్టలేదు'

'ఒక్క రోజూ స్కూల్ డుమ్మా కొట్టలేదు'

MDK: మనోహరాబాద్ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె. వేణుప్రియ అరుదైన రికార్డు సాధించింది. 6వ తరగతి చదువుతున్న ఈ చిన్నారి ఈ విద్యాసంవత్సరంలో ఒక్క రోజూ సెలవు పెట్టకుండా బడికి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తం 223 పనిదినాలకు గానూ 223 రోజులు హాజరై 100% హాజరు నమోదు చేసింది. వేణుప్రియ క్రమశిక్షణను, చదువుపై ఉన్న ఆసక్తిని ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.