సీఐ తల్లి హత్య కేసులో నిందితుడు ఆత్మహత్యాయత్నం

సీఐ తల్లి హత్య కేసులో నిందితుడు ఆత్మహత్యాయత్నం

అన్నమయ్య: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ధర్మవరం సీఐ నాగేంద్ర తల్లి స్వర్ణకుమారి హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడు గజ్జలకుంట అనిల్ అలియాస్ పకోడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చేరాడు. ములకలచెరువు వద్ద అనిల్ విషం తాగి చెట్ల పొదల్లో పడి ఉండగా స్థానికులు 108కు సమాచారం అందించారు. దీంతో బాధితుడిని హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.