అక్రమ ఇసుక నిల్వ ట్రాక్టర్లు సీజ్

అక్రమ ఇసుక నిల్వ ట్రాక్టర్లు సీజ్

VKB: బొంరాస్‌పేట మండలం దుప్‌చెర్లలో అక్రమంగా నిల్వ ఉంచిన 8 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఆర్ఐ శిరీష నిన్న తెలిపారు. వీటిని ఇవాళ ఉదయం 11 గంటలకు వేలం వేస్తామన్నారు. మండల పరిధిలో అనుమతి లేకుండా ఇసుకను రవాణా చేసినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దుప్‌చర్ల, మహంతిపూర్‌లో రెండు ఇసుక రీచ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆమె తెలిపారు.