' అధికారులు అప్రమత్తంగా ఉండాలి '

' అధికారులు అప్రమత్తంగా ఉండాలి '

SDPT: అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సిద్దిపేట సీపీ ఎస్.ఎం. విజయ్ కుమార్ సూచించారు. సోమవారం సాయంత్రం ఆయన తొగుట పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాలకు సంబంధించిన వీపీఓలు రెండు, మూడు రోజులకు ఒకసారి గ్రామాలను సందర్శించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవాలన్నారు. గ్రామాల్లో ప్రజలతో స్నేహపూర్వకమైన సంబంధాలు కొనసాగించాలన్నారు.