'ఆర్టీసీ సమ్మెను సక్సెస్ చేయాలి'

'ఆర్టీసీ సమ్మెను సక్సెస్ చేయాలి'

NLG: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22 నుంచి చేపట్టే ఆర్టీసీ సమ్మెను విజయవంతం చేయాలని రాష్ట్ర జేఏసీ ఛైర్మన్ ఇదురు వెంకన్న, థామస్ రెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ డిపోలో గురువారం సమ్మె కరపత్రాలను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులంతా ఏకమై సమ్మెలో పాల్గొని హక్కులు సాధించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు యాదయ్య, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.