VIDEO: జోరందుకున్న వినాయక విగ్రహాల విక్రయాలు

VIDEO: జోరందుకున్న వినాయక విగ్రహాల విక్రయాలు

KMM: వినాయక చవితి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో విగ్రహాల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈ నెల 27న జరుపుకోనున్న పండుగ కోసం భక్తులు ముందస్తుగా విగ్రహాలను కొనుగోలు చేసి అడ్వాన్సులు చెల్లిస్తున్నారు. పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలకు ఈ ఏడాది అధిక ప్రాధాన్యత లభిస్తోంది. గ్రామాల నుంచి వచ్చిన యువకులు ముందుగానే విగ్రహాలను బుక్ చేసుకుంటున్నారు.