గండ్లు పూడ్చాలని మంత్రి నిమ్మలకు ఎమ్మెల్యే వినతి

కృష్ణా: బుడమేరు పరివాహక ప్రాంతంలో గత ఏడాది సంభవించిన ఆకస్మిక వరదల వల్ల ఏర్పడిన గండ్లు పూడ్చాలని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకి, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గురువారం విజ్ఞప్తి చేశారు. ఏపీ రాజధాని అమరావతిలోని సెక్రటేరియట్‌లో ఆయనను ప్రత్యేకంగా కలిశారు. రానున్న వ్యవసాయ ఖరీఫ్ సీజన్ లోపు యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూర్తి చేయాలని కోరారు.