ఒంగోలులో ట్రాఫిక్ పోలీసులు విస్తృత తనిఖీలు

ఒంగోలులో ట్రాఫిక్ పోలీసులు విస్తృత తనిఖీలు

ప్రకాశం: ఒంగోలులో శనివారం ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ మేరకు పెండింగ్ చలాన్లు, అలాగే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిని గుర్తించేందుకు జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఈ మేరకు ఒంగోలులోని చర్చి కూడలి వద్ద తనిఖీలు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు సరైన ధ్రువీకరణ పత్రాలు లేనివారిని జరిమానాలు విధించారు.