జాతీయ రహదారి సమీపంలో లారీ బోల్తా

జాతీయ రహదారి సమీపంలో లారీ  బోల్తా

SKLM: మందస(M) బాలిగాం గ్రామ సమీప జాతీయ రహదారిపై మంగళవారం ముందు వెళ్తున్న లారీను అధికమించే క్రమంలో వెనుక నుంచి మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముందు వెళ్తున్న లారీ మెటల్ క్రాస్ బేరర్‌ను ఢీకొని సర్వీస్ రోడ్‌లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తణుకు నుంచి కోడిగుడ్ల లోడుతో పశ్చిమ బెంగాల్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.