ఎస్పీ రత్నకు పుట్టపర్తిలో ఘన వీడ్కోలు

సత్యసాయి: బదిలీపై వెళ్తున్న జిల్లా ఎస్పీ వి. రత్నకు పుట్టపర్తిలో జిల్లా పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. 15 నెలల పాటు శాంతి భద్రతలు, నేరాల నియంత్రణ, మహిళలు, పిల్లల భద్రతలో చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ శాలువా కప్పి సత్కరించి, పూలవర్షంతో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.