'నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు'

'నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు'

KDP: పులివెందులలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని SI మధుసూదన రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ముద్దనూరు రింగ్ రోడ్డులో సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారికి రూ.1000 జరిమానా విధించారు. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండడంతో పాటు హెల్మెట్, సీటు బెల్ట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.