దారుణం.. సజీవ దహనమైన తండ్రి, కూతురు
HNK: కాజీపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తండ్రి రాజశేఖర్ (54) మంటల్లో చిక్కుకోగా, కాపాడేందుకు వెళ్లిన కుమార్తె రాజశ్రీ (24) కూడా కాలిపోయి ఇద్దరూ మృతి చెందినట్లు తెలిపారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఈ మేరకు అనుమానాస్పద కేసుగా పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.