కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రసంగించాలి: మంత్రి

నల్గొండ: కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్గొండకు రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. SLBCని కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని, నల్గొండ సభలో ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ప్రసంగించాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు.