'సంపూర్ణంగా వ్యాధి నిరోధక టీకాలు వేయాలి'

'సంపూర్ణంగా వ్యాధి నిరోధక టీకాలు వేయాలి'

KMM: సంపూర్ణంగా వ్యాధి నిరోధక టీకాలు వేయాలని Dy. DMHO డా. చంద్ నాయక్ అన్నారు. బుధవారం దెందుకూరు పీహెచ్సీ పరిధిలోని మధిర-2 హెల్త్ సెంటర్‌ను డిప్యూటీ డిఎంహెచ్‌వో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు, గర్భిణులకు తప్పనిసరిగా టీకాలు వేయాలని సూచించారు. అలాగే బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని సూచించారు.