మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా దాసరి కత్తెరేణమ్మ

మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా దాసరి కత్తెరేణమ్మ

GNTR: ఫిరంగిపురం మండలానికి చెందిన దాసరి కత్తెరేణమ్మని మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారు. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుంచి ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షులు మాజీ CM జగన్‌కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.