VIDEO: నూతన రహదారులను ప్రారంభించిన ఎమ్మెల్యేలు
కృష్ణా: గత ప్రభుత్వ విధ్వంస పాలనలో నిర్లక్ష్యానికి గురైన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. గుడ్లవల్లేరులో రూ.1.50 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన రోడ్లను ఎమ్మెల్యేలు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.