మహా శివరాత్రికి రామచంద్రపురం డిపో నుంచి ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రికి రామచంద్రపురం డిపో నుంచి ప్రత్యేక బస్సులు

కోనసీమ: మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలైన కోటిపల్లి, ద్రాక్షారామ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు రామచంద్రపురం డిపో మేనేజర్ పి.భాస్కరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాజమండ్రి, యానం, సామర్లకోట తదితర ప్రాంతాల నుంచి ఈ సర్వీసులను నడుపుతున్నట్లు తెలిపారు.