VIDEO: కొత్తపల్లిలో పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు
నల్గొండ మండలం కొత్తపల్లిలోని పలు వార్డుల్లో వీధి దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉన్నాయని, వాటిని ఆర్పేందుకు అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల GPకి బిల్లుల భారం పెరిగి ప్రజాధనం వృధా అవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.