పెండింగ్ కేసుల్లో నిందితులను అరెస్ట్ చేయండి

VZM: జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో NDPS చట్టం ప్రకారం నమోదై, దర్యాప్తులో ఉన్న గంజాయి కేసులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం తన కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. అరెస్టులు పెండింగులో ఉన్న కేసుల్లో నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. పరారీలో ఉన్న నిందితుల గురించి సమాచారం సేకరించాలన్నారు.