47 మంది కార్మికులకు లేబర్ కార్డుల పంపిణీ

47 మంది కార్మికులకు లేబర్ కార్డుల పంపిణీ

NRPT: నారాయణపేట మండలంలోని బోయిన్పల్లిలో ఆశ్రయ స్వచ్ఛంద సంస్థ, లేబర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 47 మంది కార్మికులకు లేబర్ కార్డులను పంపిణీ చేశారు. సర్పంచ్ వెంకటేశ్ మాట్లాడుతూ.. ప్రతి కార్మికుడు లేబర్ కార్డు పొంది ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్య క్రమంలో జిల్లా కోఆర్డినేటర్ ప్రవీణ్, నరేష్, నర్సమ్మ పాల్గొన్నారు.