బ్రహ్మంగారిమఠంలో మధ్యాహ్న భోజనం తనిఖీ.!
KDP: బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని బుధవారం విద్య కమిటీ ఛైర్మన్ గురు ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నారా? లేదా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన నాణ్యత విషయంలో తేడాలు వస్తే ఉపేక్షించేది ఉండదని ఆయన ఈ సందర్భంగా సూచించారు.