అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు

కృష్ణా: యనమలకుదురు వినాయక నగర్ నందు రోడ్లు, డ్రెయిన్ల అభివృద్ధికి రూ.2 కోట్ల నిధులు కేటాయించినట్లు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. ఆదివారం పెనమలూరులో ఆయన మాట్లాడుతూ.. మంచినీటి సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. వైసీపీ గత ఐదు సంవత్సరాలుగా యనమలకుదురు వంతెన పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు.