మణుగూరు ఆసుపత్రికి భారీగా రోగుల రాక

KMM: మణుగూరు వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి కిటకిటలాడింది. శుక్రవారం వివిధ ప్రాంతాల ప్రజలు ఉదయం 9గంటల నుంచే క్యూ కట్టారు. దీంతో ఓపీ వద్ద భారీ క్యూలైన్ ఏర్పడగా చీటీ తీసుకునేందుకు గంటల సమయం పట్టింది. అలాగే, పలు విభాగాలు కిక్కిరిసి కనిపించాయి. ఇటీవల వర్షాలతో నీరు నిలిచి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతుండడంతో చుట్టు పక్కల జనం ఆస్పత్రికి వస్తున్నారు.