భీమిలిలో యునాని డిస్పెన్సరీ శంకుస్థాపన
VSP: భీమిలి ఆరోగ్య కేంద్రంలో కొత్తగా నిర్మించనున్న యునాని డిస్పెన్సరీ భవనానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రూ.30 లక్షలతో భవనం నిర్మించనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యునాని వైద్యాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొస్తోందని తెలిపారు.