మధ్యాహ్నం శంకర్ గౌడ్ అంత్యక్రియలు
TG: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ మృతదేహం తన అల్లుడి స్వగ్రామానికి చేరుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు ప్రత్యేక అంబులెన్స్‌లో అధికారులు తరలించారు. ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో బండి సంజయ్, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొననున్నారు.