విషాదం.. రైలు కిందపడి తెగిపోయిన కాళ్లు
ATP: జిల్లాలోని రాయదుర్గం పట్టణంలోని ముత్తరాసి కాలనీలో రాత్రి విషాదం చోటుచేసుకుంది. రాముడు అనే వ్యక్తి బహిర్భూమికి వెళ్లగా రైలు పట్టాలపై కాలు జారి పడిపోయాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన గూడ్స్ రైలు చక్రాల కింద పడటంతో అతని రెండు కాళ్లు తెగిపోయాయి. స్థానికులు అతడిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం ఉన్నత ఆసుపత్రికి సిఫార్సు చేశారు.