నేడు జిల్లా స్థాయి ఫెన్సింగ్ ఎంపికల పోటీలు

నేడు జిల్లా స్థాయి ఫెన్సింగ్ ఎంపికల పోటీలు

శ్రీకాకుళం: జిల్లా స్థాయి చైల్డ్ అండ్ మినీ ఫెన్సింగ్ ఎంపిక పోటీలు గురువారం నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బలభధ్రుని రాజా ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శ్రీకాకుళం టౌన్ హాల్ వేదికగా అండర్-10, అండర్-12 విభాగాల్లో బాలురు బాలికలకు పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 7660874844 ఈ నెంబర్‌ను సంప్రదించాలన్నారు.