'కామారెడ్డి జిల్లాకు కానిస్టేబుల్ కిష్టయ్య పేరు పెట్టాలి’
కామారెడ్డి జిల్లాకు కానిస్టేబుల్ కిష్టయ్య పేరు పెట్టాలని BC, SC, ST-JAC రాష్ట్ర కన్వీనర్ వోఆర్ విశారదన్ మహారాజ్ డిమాండ్ చేశారు. శనివారం కామారెడ్డిలో నిర్వహించిన BC ఆక్రోశ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాన్ని ఫణంగా పెట్టిన కానిస్టేబుల్ కిష్టయ్య పేరు జిల్లాకు పెట్టాలన్నారు.