'అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి'
PDPL: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. రామగుండం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. TUFIDC సహా వివిధ పథకాల కింద జరుగుతున్న పనులను గడువులోగా పూర్తి చేయాలని స్పష్టంచేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.