VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
NLR: వలేటివారిపాలెం మండలం పోకూరు–రాళ్లపాడు రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. రూ. 3 కోట్ల ఎండిఆర్ గ్రాంట్‌తో 18 కి.మీ మేర ఈ పనులు జరగనున్నాయి. ముందుగా స్థానిక ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పనులను నాణ్యతతో, డ్రైనేజీ వసతులకు అనుగుణంగా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.