పాతకోటకు ఆర్టీసీ బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే
SKLM: మందస మండలం గిరిజన ప్రాంత ప్రజల కోరిక మేరకు పలాస ఆర్టీసీ అధికారులతో మాట్లాడి మందస నుంచి పాతకోటకు ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను శనివారం ఎమ్మెల్యే గౌతు శిరీష పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన ప్రాంత ప్రజలు తమ అవసరాలకు మందస రావాలంటే ట్రక్కులు, ఆటోలపై ప్రమాదకర ప్రయాణాలు చేసేవారని ఆమె పేర్కొన్నారు.