అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు వేగంగా సన్నాహాలు
ములుగు జిల్లాలో ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయని ఛైర్మన్ జన్ను రవి తెలిపారు. ఏర్పాట్లపై సభ్యులతో సమీక్ష నిర్వహించి, ప్రతి గ్రామంలో కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైస్ ఛైర్మన్ నెమలి నర్సయ్యతో పాటు పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.