ఉత్సవమూర్తులకు వెండి ఆభరణాలు బహుకరణ
JGL: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో ఉత్సవ మూర్తులకు భక్తి పూర్వకంగా వెండి ఆభరణాలను సమర్పించారు. సీతమ్మ వారికి హారం, కిరీటం, శ్రీరాముడికి విల్లు, ధనుస్సు, ఖడ్గం సమర్పించారు. అనంతరం స్వామి వారికి సహస్రా కలశాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.