ఆత్మకూరులో మంత్రి ఆనం పర్యటన
NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంగళవారం ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో దాదాపుగా ఏడు కోట్ల రూపాయలతో నిర్వహించేందుకు తలపెట్టిన రోడ్లు, కాలువలను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని అధికారులను ఆదేశించారు.