విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
VZM: జామి మండల కేంద్రంలోని జంగాలకాలనీ నుంచి గొల్లవానిపాలెం వరకు విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక ప్రజలు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి దృష్టికి తీసుకువెళ్లడంతో తక్షణమే ఆమె స్పందించారు. విద్యుత్ అధికారులతో మాట్లాడి కాలనీ వాసులకు విద్యుత్ సరఫరాను నెలకొల్పారు.