రూ.37.91 లక్షల విలువైన ఎరువులు సీజ్

రూ.37.91 లక్షల విలువైన ఎరువులు సీజ్

GNTR: పొన్నూరులోని ఓ ఎరువులు, పురుగు మందుల షాపులో మంగళవారం విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్, వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. షాపులో అమ్మకపు బిల్లుల మీద రైతుల సంతకాలు, ధరల పట్టిక సరిగ్గా రాయకపోవడంతో రూ.37.91 లక్షల విలువైన 2,46,595 లీటర్ల పురుగు మందులను సీజ్ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ రామకోటేశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు.