కనిగిరి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షునిగా సురేష్ రెడ్డి
ప్రకాశం: కనిగిరి నియోజకవర్గ అనుబంధ కమిటీల అధ్యక్షులను MLA ఉగ్ర నరసింహారెడ్డి ప్రకటించారు. నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడిగా దొడ్డ వెంకట సురేశ్ రెడ్డి నియమితులయ్యారు. తనపై నమ్మకం ఉంచి తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించిన చంద్రబాబుకు, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి సురేశ్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.