VIDEO: TTD మ్యూజియంలో మోగిన అలారం
తిరుమలలోని టీటీడీ మ్యూజియంలో శనివారం ఉదయం అలారం మోగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే టీటీడీ ఇంజినీరింగ్, విజిలెన్స్, పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సాంకేతిక లోపంతో అలారం మోగిందని గుర్తించారు. దీంతో మ్యూజియం సిబ్బంది, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.