కొలిమిగుండ్లలో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

NDL: కొలిమిగుండ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయం ఆవరణలో రేపు హాయ్ మిత్ర కంటి వైద్యశాల వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు కంటి వైద్య సహాయ నిపుణులు గోపాల్ సోమవారం వెల్లడించారు. ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తామన్నారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని ఉచితంగా కడపకు తీసుకువెళ్లి సర్జరీ నిర్వహించి తీసుకువస్తామని తెలిపారు.