పోలంపల్లిలో బోరు మోటార్ చెడిపోయి నీటి కష్టాలు

పోలంపల్లిలో బోరు మోటార్ చెడిపోయి నీటి కష్టాలు

KMM: కారేపల్లి మండలంలోని పోలంపల్లి హరిజనవాడలో బోరు మోటార్ చెడిపోయి రెండేళ్లయినా అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. మిషన్ భగీరథ నీరు అందని సమయంలో, మరమ్మతులు చేయకపోవడంతో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా ఏర్పాటు చేసిన మోటార్‌ను తక్షణమే బాగు చేయించాలని ప్రజలకు కోరుతున్నారు.