VIDEO: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లైంగిక వేధింపులు
AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లైంగిక వేధింపులు ఘటన గురువారం కలకలం సృష్టించింది. ఎకనామిక్స్ విభాగంలో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న నారాయణరావు 2022 సంవత్సరంలో కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. ఒక విద్యార్థినికి ఆయన లైంగిక వేధింపులకు గురి చేయడంతో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేశారు.