పెన్నా నదికి నీటి విడుదల
KDP: మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి 4.300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఈఈ రమేష్ సోమవారం తెలిపారు. మైలవరం జలాశయం దక్షిణ కాలువకు 140 క్యూసెక్కుల నీరు పోతుందని చెప్పారు. గండికోట జలాశయం నుంచి మైలవరం జలాశయానికి 5 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 5.95 టీఎంసీలు నీరు నిల్వ ఉందన్నారు.