ఆకట్టుకున్న విద్యార్థులు విచిత్ర వేషధారణ పోటీలు
AKP: నర్సీపట్నం PRTU ఆధ్వర్యంలో గురువారం విద్యార్థిని విద్యార్థులకు విచిత్ర వేషధారణ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారు 200 మందికి పైగా చిన్నారులు పాల్గొని తమ వేషధారణతో అందరిని అలరించారు. బాలల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం సిటీ క్లబ్ ఆవరణలో ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు ఇస్తామని PRTU తెలిపింది.