యువతి అదృశ్యం.. కేసు నమోదు

యువతి అదృశ్యం.. కేసు నమోదు

కర్నూలులో ఇంటర్ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న లక్ష్మీనగర్‌కు చెందిన లక్ష్మీ ప్రసన్న అనే యువతి అదృశ్యమైంది. అక్టోబర్ 30న కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని తల్లి 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కళాశాల యాజమాన్యం ఆమె ఆ రోజు రాలేదని తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.