ముత్తుకూరులో రేపు ఎమ్మెల్యే పర్యటన

ముత్తుకూరులో రేపు ఎమ్మెల్యే పర్యటన

NLR: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంకటాచలం, ముత్తుకూరు మండలాలలో బుధవారం పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు వెంకటాచలంలోని గొలగమూడి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు ముత్తుకూరులో ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివ్యాంగులకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.